నవంబర్ నుంచి సమంత కొత్త ప్రయాణం?

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సమంత ఇంతలోనే ఒక కొత్త దర్శకుడు చేయనున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్నారు. అయితే కొత్త కావడంతో సమంత వెంటనే సినిమా చేయడానికి అంగీకరించిందని, ఈ సినిమా నవంబర్ నుంచి  మొదలు కానుందని తెలిసింది.అదీ కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అని సమాచారం.

- Advertisement -

ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ సమంత తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా నాగచైతన్య సమంత విషయంలో వస్తున్న రూమర్స్ పై ఒక విలేకరి ప్రశ్నించగా అందుకు సమంతా కూడా ఘాటుగానే స్పందించారు.

Share post:

Popular