ప్రమాదం తర్వాత ఫస్ట్‌టైం స్పందించిన సాయి తేజ్.. ఫేస్ బుక్ లో ఏం అన్నారంటే?

హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇటీవల బైక్ యాక్సిడెంట్ ఆయన విషయం అందరికి తెలిసిందే. ఇక బైక్ యాక్సిడెంట్ అయిన తరువాత వెంటనే అతని అపోలో హాస్పటల్ కు తరలించారు. ఇక ఆ తర్వాత సాయి ధర్మ తేజ్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఇటు అతని అభిమానులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తూ నే ఉన్నారు.

- Advertisement -

ఇక తాజాగా సాయి తేజ్ కోలుకొని తన అభిమానులకు చిన్న అప్డేట్ ను ఇచ్చారు. తన అప్ కమింగ్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో అతని అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మొదట ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టు ఆ తర్వాత సినిమాలు చేసుకుందాం అంటూ అభిమానులు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు.

ఇక సాయి తేజ్ పోస్ట్ చేసిన రిపబ్లిక్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో సాయి కలెక్టర్ గా నటిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతోంది. పట్టాలు తప్పిన పాలక వ్యవస్థను కార్యనిర్వాహక న్యాయ శాఖ కలిసి దారిలో పెట్టే కథగా ఈ రిపబ్లిక్ సినిమా ఉండబోతున్న ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Share post:

Popular