సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు అందరూ. నటి రోజా మాత్రం తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ.. నా జీవితాన్ని కొనసాగించు కుంటూ వచ్చానని తెలియజేసింది రోజా. ఇక తాను 2008 వరకు తాను అప్పులలోనే ఉన్నాను అంటూ తెలియజేసింది.
సినీ ఇండస్ట్రీలో తనని ఎంతో మంది అవమానించారని, తనకి అందం లేదని కూడా అనే వారిని, అంతేకాకుండా డాన్స్,డైలాగ్స్ రావడం కూడా చేత కాదని డైరెక్టర్ల చేతిలో అవమానపడ్డ అనుకున్నట్లుగా తెలియజేసింది. అయితే సెల్వమణి డైరెక్షన్ లో ఒక సినిమా తీసిన తర్వాత.. వీటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టింది రోజా. ఇక ఆ తర్వాత ఆయనతోనే వివాహం చేసుకున్నది.
ఆ తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించానని తెలియజేసింది. తన గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఫ్రెండ్స్ హాస్పిటల్లో తాను రెండు నెలలుగా చికిత్స చేయించుకుంనని రోజా తెలియజేసింది. అంతేకాకుండా అప్పుడు రెండు మాసాల వరకు నేను స్నానం కూడా చేయలేదు అని, తన రెండు కాళ్లు పైకి పెట్టించి..అలాగే ఉంచారని తెలియజేసింది. దీంతో అబార్షన్ కాకుండా ఉంటుందని ఇలా చేశారని తెలియజేసింది.ఇలాంటి కష్టాలు ఎటువంటి వారికి రాకూడదని తెలియజేస్తోంది రోజా. ఇక తిరిగి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు ఆనందభాష్పాలు వచ్చాయని తెలియజేస్తోంది