అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖ‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అందాల భామ రాశి ఖ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Tough times for Raashi Khanna! | TeluguBulletin.com

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాశి ఖ‌న్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని, తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాల‌ని, అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది.

Download] Rashi Khanna Hot Photos And Images

అంతేకాదు, అటువంటి వ్య‌క్తి కోసం ఎప్ప‌టి నుంచో వెతుకుతున్న‌ట్టు కూడా తెలిపింది. దాంతో రాశి ఖ‌న్నా పెళ్లి మ్యాట‌ర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా, రాశి ప్ర‌స్తుతం తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా, పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాల్లో న‌టిస్తోంది.