రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన వర్మ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడు.
ఎవరు చూసినా చూడకపోయినా తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తు.. వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు తీవ్రంగా విసుగు తెప్పిస్తున్నాడు. మరోవైపు ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకుంటూ వార్తల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నారు. దాంతో దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మ పని అయిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
అయితే ఇలాంటి తరుణంలో వర్మ ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. కన్నడ స్టార్ ఉపేంద్రతో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు తాజాగా సోసల్ మీడియా వేదికగా వర్మ వెల్లడించారు. నిన్న ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఉపేంద్రతో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నామని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తాం. ఉపేంద్రకి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై వర్మ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
HAPPY to announce that Me and @nimmaupendra are starting an action film VERY SOON and here’s wishing him MANY HAPPY RETURNS OF THE DAY #HappyBirthday #upendra pic.twitter.com/nFaNhZYYNt
— Ram Gopal Varma (@RGVzoomin) September 18, 2021