పుష్ప మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తు్న్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ రఫ్ లుక్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన తొలి సింగిల పాట ‘దాక్కొ దాక్కొ మేక’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఇలాంటి ఫార్ములానే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తొలి సింగిల్ పాటను ఒకేసారి ఐదు భాషల్లో రికార్డ్ చేయడంతో పాటు ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేసింది పుష్ప టీమ్. అయితే ఇప్పుడు రెండో పాటను కూడా ఇదే తరహాలో ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఓ రొమాంటిక్ పాటను పుష్ప చిత్రం నుండి వదలబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Share post:

Latest