ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

ఇటీవల మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మంచు విష్ణు తరఫున బాబు మోహన్ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న బాబూ మోహన్ శుక్రవారం నాడు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఒక మీడియా సమావేశం నిర్వహించారు.. ఇక ఈ సమావేశం లో మంచు విష్ణు ఏర్పాటుచేసిన ప్యానెల్ సభ్యులంతా హాజరయ్యారు.. బాబు మోహన్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పై ఫైర్ ఆడడం జరిగింది.

- Advertisement -

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను చూస్తేనే ముచ్చటేసేది.. కానీ మా.. ఇప్పుడిప్పుడే సెట్ అవుతోంది అనుకుంటున్న నేపథ్యంలోనే ఎవరి వల్ల అయితే ఇండస్ట్రీకి పేరు వచ్చిందో.. వాళ్లను పక్కనపెట్టి ఈ ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండడం చాలా బాధాకరం.. నీలాంటి వాళ్ళను ఈ ఇండస్ట్రీ ఎంతోమందిని పుట్టిస్తుంది. కళామ్మతల్లికి సేవ చేయాలనుకుంటే చేయాలి కానీ నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు అంటూ ప్రకాష్ రాజు పై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంతే కాదు ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అవతల ప్యానల్ ప్రెసిడెంట్ అట.. ఏదో మాట్లాడుతున్నాడు.. మా గురించి స్టడీ చేశా.. అక్కడ ఉన్నది ఎంతో మంది కాదు.. అంత మంది.. 150 మంది లోకల్ కాదని, వీళ్లు పనికి వస్తారు.. వీళ్లు పనికిరారు.. వీళ్ళు ఓట్లు వేయరు..ఇలా నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు.. సినీ ఇండస్ట్రీ లో పనికి రాని వాడంటూ ఎవరైనా ఉంటాడా..? ఇలా విడదీసి మాట్లాడడం నాకు బాధ కలిగింది.. ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకురావాలి అనుకునేవాడు కళామ్మతల్లికి ముద్దుబిడ్డ ఎలా అవుతాడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మోహన్ బాబు.

Share post:

Popular