హారర్ స్టోరీతో ప్ర‌భాస్‌ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్క‌డే తేడా కొడుతోందిగా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మ‌రోవైపు ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో `స‌లార్‌` మ‌రియు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు.

Prabhas - IMDb

ప్ర‌స్తుతం ఈ మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌భాస్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇందుకు రంగం సిద్ధం అవుతోంద‌ని.. ఓ బ‌డా నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో ఒక హై బడ్జెట్ సినిమాని ప్లాన్ చేయాలని చూస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Prabhas (@PrabhasRaju) | Twitter

అంతేకాదు, అది ఒక హారర్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే ఇక్క‌డే తేడా కొడుతోంది. ఎందుకంటే, ప్ర‌భాస్‌కు హార‌ర్ స్టోరీలు అస్స‌లు న‌చ్చ‌వు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న హార‌ర్ జోన‌ర్‌ను ట్రై చేయ‌లేదు. మ‌రి ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌భాస్ ఆ హార‌ర్ స్టోరీకి ఓకే చెబుతాడా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.