ప్రభాస్ నటించబోతున్న సినిమాలో.. సగం బడ్జెట్ అంతా ఆ సన్నివేశాల కోసమేనట..!

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు హీరో ఆ తర్వాత సాహో సినిమా తో బాలీవుడ్ లో ఆయనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇదే నేపథ్యంలో వస్తున్న చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా ఇవన్నీ పాన్ ఇండియా మూవీలే అవ్వడం విశేషం.

ఇక ప్రభాస్ ప్రస్తుత చిత్రం సలార్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మూడో షెడ్యూల్ సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందుకోసం ఈ చిత్ర బృందం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సగం బడ్జెట్ అంతా యాక్షన్ సీన్ల కోసమే ఖర్చు చేస్తున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది.

కే.జి.ఎఫ్ సినిమా తో సత్తాచాటిన ప్రశాంతి నిల్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని ఎంత మాస్ యాంగిల్ లో చూపిస్తాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.

Share post:

Latest