పోసాని కి కోపం ఎక్కువ అంటున్న శ్రీలేఖ.. కారణం ఇదేనా..?

ఈమె టాలీవుడ్ లో మొట్టమొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందింది.. తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళం , హిందీ లో కూడా పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈమె, పాటలు కూడా పాడి తనలో ఉన్న ప్రతిభను చూపించి ఎం.ఎం.కీరవాణికి , ఏ మాత్రం తీసిపోకుండా అన్నకు తగ్గ చెల్లిగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శ్రీలేఖ యూట్యూబ్లో ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో పలు విషయాలను ఆమె ప్రేక్షకులతో పంచుకుంది. అందులో భాగంగానే పోసాని గురించి మాట్లాడుతూ.. పోసాని గారికి కోపం ఎక్కువ.. తొందరలో మాట్లాడేస్తాడు.. కానీ కూల్ అయిన తర్వాత ఫీలయ్యి, తెగ బాధపడిపోతుంటారు.. ఆయన దగ్గర ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండడమే కాకుండా సమయానికి పని చేయాలి.. లేకపోతే అవతల వాళ్ళు ఇక అంతే అంటూ ఆమె తెలిపింది..

అంతేకాదు ఒక పాట కంపోజ్ చేయడం లేట్ అయినా సరే ఎందుకు.. ఏమైంది ..అంటూ ఆరా తీస్తారు. వారిపై విరుచుకు పడతారు.. ఫోన్ చేసిన రెండో రింగు కి అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయాలి .. లేకపోతే వారిపై తన ఉగ్రరూపం చూపిస్తాడు అంటూ తెలిపింది శ్రీలేఖ.

Share post:

Popular