ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు అయిన రమేష్ వలియశాల ఆత్మహత్య చేసుకున్నాడు. 22 ఏళ్ళ కు పైగా అనుభవం ఉన్నాయి సీనియర్ నటుడు ఈ రోజు అనగా శనివారం సెప్టెంబర్ 11 న ఉదయం తిరువనంతపురం లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని మరణ వార్త తో మాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆయన మరణవార్త విన్న నటీ నటులు అలాగే దర్శకనిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అతని కుటుంబానికి సంతాపం తెలుపుతూ రమేష్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈయన కేరళ పరిశ్రమలో వరుసగా సీరియల్ అలాగే సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్ బిజీగా ఉండేవారు. ఇలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనితో పోలీసులు అతని మరణాన్ని అనుస్పాద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. ఇతను రెండు రోజుల క్రితమే షూటింగ్ నుంచి తిరిగి వచ్చారని, ఇలా వచ్చిన రోజు జీవచ్చవంలా కనిపించడంతో అతనితో నటించే నటీనటులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Share post:

Latest