మేము ప్రకాష్ రాజ్ అంతా ఒకటే.. పవన్ కళ్యాణ్?

రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నాయకులను టార్గెట్ చేస్తూ విరుచుకు పడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్ర పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆవేశం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరు విప్పి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక చిరంజీవి గారు వాళ్లని ఎందుకు బతిమిలాడు కుంటున్నారు అని ఒక వ్యక్తి నాతో అన్నారు, అయినా అది మంచి మనసు కాబట్టి బ్రతిమాలాడు కుంటారు. ఎవరో మంత్రి చిరంజీవితో నాకు సోదర భావం ఉంది అన్నారు.

చిత్ర పరిశ్రమకు పనికిరాని ఈ సోదరభావం ఎందుకు తీసుకెళ్లి చెత్తలో వేయండి అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ప్రతిభావంతులైన నటుడు ప్రకాష్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అంటూ విమర్శలు చేయడం తప్పు అని పవన్ అన్నాడు. ఎన్నికల సమయంలో ప్రకాష్రాజ్ చేసిన కామెంట్స్ ను ఆయన అభిప్రాయంగానే తీసుకున్నాను. అంతేగాని ప్రకాష్ రాజ్ కు నాకు ఎలాంటి గొడవలు లేవు. సినీ పరిశ్రమకు వస్తే మేమంతా ఒక్కటే అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.