పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఆ దేశంలో హాలిడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి.. ఆయన అభిమానులు, ఆయనను దేవుడిగా పూజించడమే కాకుండా ఆయన పుట్టినరోజును పండుగ కంటే ఎక్కువ ఉత్సాహం తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ , అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు…

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే.. పవన్ కళ్యాణ్ కు దేశం నలుమూలల అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కాబట్టి భారతదేశం అంతట ఆయన అభిమానులు కేక్ కటింగ్ చేయడం, పాలాభిషేకాలు చేయడం ఇలా ఎన్నెన్నో చేస్తూ పవన్ కళ్యాణ్ పై తమకు వున్న ప్రేమను చూపించుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఒక ఐటీ కంపెనీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది.. అది ఏదో కాదు బీకే ఐటి సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఆఫీస్ లో పని చేసే వారితో పాటు వేర్హౌస్ లో కూడా పనిచేస్తున్న వారికి పవన్ పుట్టినరోజునాడు హాలిడే ఇచ్చేసింది. ముఖ్యంగా ఈ విషయాన్ని బీకే ఐటీ సొల్యూషన్స్ డైరెక్టర్ బాలు రెడ్డి తమ కంపెనీ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సెలవు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేయడం గమనార్హం..

ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.. భారత దేశానికి సేవ చేసిన మహనీయులకు ,అత్యంత ప్రముఖులకు మాత్రమే వారి పుట్టినరోజు సందర్భంగా సెలవు దినాలు ప్రకటించడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం తన ఫేవరెట్ హీరో బర్త్ డే కాబట్టి ఈ రోజు సెలవు ప్రకటించడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు.https://twitter.com/BaluReddyUK/status/1433134407339085828?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1433134407339085828%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fnewsorbit-epaper-nwsorbt%2Fbreakingpavankalyaanputtinarojunaaduamerikaalohaalide-newsid-n312040130%3Fs%3Dauu%3D0x88bfb698cf8df12css%3Dwsp

Share post:

Latest