అమెజాన్ ప్రైమ్ లో పాగల్ సినిమా.. ఎప్పుడంటే?

పాగల్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అయింది. ఈ సినిమాకు నరేష్ దర్శకత్వం వహించారు. అలాగే దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే సినిమా సూపర్ హిట్ అయినట్లు భావిస్తాను అని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈ నెల 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ మాట్లాడుతూ పాగల్ సినిమాకు బాగానే వసూలు వచ్చాయి.

సినిమా మొదలైన తర్వాత మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. ప్రజలు ఈ కరోనా థర్డ్ వేవ్ కు భయపడి అంతంత మాత్రానే థియేటర్స్ కు వస్తున్నారు అంటూ తెలిపారు. అలాగే ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమా చేస్తున్నాం. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. ఓటిటి ప్లాట్ ఫామ్స్ వల్ల మార్కెట్ పెరిగింది నిజానికి అందరూ థియేటర్స్ కి రారు.అలా రాని వారు ఓటిటి ల్లో సినిమాలు చూస్తున్నారు అని తెలిపారు. ఆ వ్యూయర్స్ అంతా కూడా ఎక్సట్రా అడియన్స్ అని తెలిపారు.

Share post:

Latest