ఛీఛీ.. ఏంటా డ్రస్సు బిచ్చగత్తేలా ఉన్నావ్ అంటూ నటిపై ట్రోల్?

కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అలాగే మనుషులు జీవనశైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇలా కాలానికి అనుగుణంగా మనుషులు ధరించే దుస్తులను కూడా ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ లో జీన్స్, బెగ్గర్ జీన్స్, పొట్టి డ్రెస్సులు, చిరిగిన దుస్తులు ఇలా వివిధ రకాలుగా వేసుకోవడం ఇప్పట్లో స్టైల్ అయిపోయింది. కేవలం సామాన్యుల మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి దుస్తులను ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో చేయగా, ఆమె వేసుకున్న డ్రస్సు పై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు.

ఆ ఫోటోలో ఆమె డెనిమ్ జాకెట్ ధరించి ఉండగా, ఆమె వేసుకున్న జీన్స్ ప్యాంటు విను కల అలాగే ముందు భాగంలో జరిగినట్లుగా ఉంది. దీనితో ఆమె డ్రస్సుపై నెటిజన్లు దారుణంగా జోకులు వేస్తున్నారు. ఊర్వశి డ్రెస్ డిజైనర్ ఎవరో పట్టుకోండి, అమ్మ బాబోయ్ ఇది డ్రెస్సా? అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే ఆమెను దారుణంగా బిచ్చగత్తె తో పోలుస్తున్నారు. కొందరు ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకు ఏంటి అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.