దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వరలోనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పటికే గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే.. ఆమె అభిమానుల్లో ఓ కంగారు మొదలైంది.
ఇంతకీ కంగారెందుకు అంటే..ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న నయన్ పెళ్లి తర్వాత కూడా నటిస్తుందా..? లేక నో సినిమాలని గుడ్‌బై చేప్పేస్తుందా..? అన్న అనుమానాలు చాలా మందిలో మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై నయన్ ముందే క్లారిటీ ఇచ్చింది.
తను నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని, తన సినీ కేరీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం నయన్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో `కాతువాకుల రెండు ఖాదల్` అనే మూవీ చేస్తోంది. అలాగే ఇటు తెలుగులోనూ పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసింది.