బిగ్‌బాస్ 5కి నాగ్‌ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం సాయంత్రం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన టాలీవుడ్‌ కింగ్ నాగార్జున‌నే సీజ‌న్ 5కి సైతం వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Bigg Boss 5 Telugu: Nagarjuna hikes his remuneration - tollywood

ఆదివారం ప్రసారం అయిన తొలి ఎపిసోడ్‌లో ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అంటూ నాగ్ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు నాగ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ సీజ‌న్‌ 5కి గానూ నాగ్ ఏకంగా రూ. 12 కోట్ల మేర పారితోష‌కం తీసుకుంటున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Nagarjuna hikes his remuneration for Bigg Boss 5 Telugu?

గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకోవ‌డం చాలా మందిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అయితే నాగార్జున హోస్టింగ్‌కు ఆడియెన్స్ క‌నెక్ట్ అవుతున్నార‌ని.. అందువ‌ల్లే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఆయ‌న అడిగినంత ఇస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Share post:

Popular