ముగిసిన సైదాబాద్ రేపిస్ట్ కథ.. అంత్యక్రియలు పూర్తి..!

గత రెండు రోజుల నుంచి సైదాబాద్ నిందితుడు రాజు గురించి ఎక్కడ చూసినా వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆరు సంవత్సరాల వయసు కలిగిన చైత్ర అనే చిన్న పాపను అత్యంత దారుణంగా, మానవత్వం మరిచి పోయి అత్యాచారం చేసి పాప ని , చంపేసిన విషయం రెండు రోజుల నుంచి అందరిలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు కూడా ఈ పాప అత్యాచారం పై స్పందిస్తున్నారు. ఎలాగైనా సరే హంతకుడిని పట్టించాలని , పట్టించిన వారికి పది లక్షలు రిమాండ్ కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

- Advertisement -

ఇకపోతే ఎట్టకేలకు నిందితుడు ఈరోజు ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి ఆత్మహత్యపై పలువురు పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. కొంతమంది పోలీసులే కావాలని ఎన్కౌంటర్ చేసి , ఆత్మహత్యగా చిత్రీకరించారని చెబుతుంటే , మరికొంతమంది పశ్చాత్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కొంతమంది చెబుతున్నారు.. ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా సరే అంతకుడు రాజు మాత్రం చనిపోయాడు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం నిందితుడు తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు.అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో రైల్వే పోలీసులు చర్చించారు.. ఆపై వరంగల్‌లోని పోతన స్మశాన వాటికలలో రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.. ఏదో ఒక దుర్మార్గుడు మరణించి ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలిగించారు అని గట్టిగా చెప్పవచ్చు.

Share post:

Popular