మెగా సినిమాలో ఇమ్మాన్యుయెల్..! ఎంతవరకు నిజం..?

ఇమ్మాన్యుయెల్.. జబర్దస్త్ కామెడీ షో లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు అని చెప్పవచ్చు.. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన ఇమ్మాన్యుయెల్ , ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. ఇకపోతే అందాల తార వర్షా తో లవ్ ఎఫైర్ ఉన్నట్టు ప్రేక్షకులను నమ్మించి, షో టిఆర్పి రేటింగ్ సాధించడం కోసం ఎంతో తపన పడ్డాడు. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా తన కామెడీతో పంచులు వేస్తూ, పంచులు వేయించుకుంటూనే అందరి చేత కడుపుబ్బ నవ్విస్తాడు..

ఇక ఎట్టకేలకు ఇమ్మాన్యుయేల్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో తెగ దుమారం రేపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాలో ఇమ్మాన్యుయేల్ కు ఒక ప్రముఖ పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఆఫీస్ నుంచి ఇమ్మాన్యుయెల్ కు ఫోన్ వెళ్లినట్లు సమాచారం. ఇక దీంతో చిరంజీవి నటించబోయే తర్వాతి చిత్రంలో ఈ కమెడియన్ కు ఒక పాత్ర ఉందని ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇమ్మాన్యుయేల్ దశ తిరిగి పోతుంది అని చెప్పవచ్చు