హమ్మయ్య.. ఖిలాడి ఆ పని పూర్తి చేసిందట!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా, కరోనా కారణంగా పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఇక పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే ‘ఇష్టం’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఖిలాడి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest