ఇండియన్‌ను వణికిస్తున్న హీరోయిన్.. కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు శంకర్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో అనుకున్న విధంగా మాత్రం ముందుకు సాగడం లేదు.

ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి ఏదో ఒక రూపంలో అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తరువాత దర్శకనిర్మాతల మధ్య విబేధాలు రావడం, అటుపై షూటింగ్‌లో ప్రమాదం జరగడం, కరోనా కారణంగా సినిమా పలుమార్లు వాయిదా పడటం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చి పడిందట. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, దీంతో మరో ఏడాది పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో ఇండియన్2 చిత్రంలో కాజల్ పాత్ర షూటింగ్ పెండింగ్‌లో పడనుందని, మరి ఈ సినిమా పూర్తయ్యేందుకు ఇంకా ఆలస్యం కానుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమా పూర్తికాకుండానే అటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ తమ నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కిస్తుండటంతో ఇండియన్ 2 చిత్రంపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. మరి నిజంగానే ఇండియన్ 2 చిత్రానికి కాజల్ అగర్వాల్ అడ్డంకి మారుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Share post:

Latest