చరణ్ కోసం ఆ డైరెక్టర్ రెడీ అవుతున్నాడట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి యావత్ సినీ ప్రేమికులు తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా అప్పుడే లైన్‌లో పెట్టేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు. చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా రానున్న సినిమా కోసం పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలను విన్నాడట చరణ్. అయితే ‘జెర్సీ’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీలైన్‌కు చరణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడని, అందుకే ఈ డైరెక్టర్‌తో సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం గౌతమ్ ‘జెర్సీ’ హిందీ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముగించుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా పూర్తి కావడంతో చరణ్ కోసం పూర్తిస్థాయి స్క్రి్ప్టును రెడీ చేసే పనిలో ఉన్నాడట ఈ డైరెక్టర్. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూస్తున్నాడట ఈ డైరెక్టర్. మరి చరణ్ కోసం జెర్సీ డైరెక్టర్ ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో, ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.