బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన‌ జీవితా రాజశేఖర్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమ‌ధ్య‌ `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు స‌డెన్‌గా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి చేరిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు.

Jeevitha Rajasekhar to contest for MAA Elections – Telugu Nestam

అయితే ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల‌..ఆ వెంటనే తాను జనరల్‌ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నట్టు వెల్ల‌డించారు. దాంతో జీవితా రాజశేఖర్… ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేర‌డం వ‌ల్లే బండ్ల గణేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని, వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్త‌లు ఊపందుకున్నాయి.

Rumour: Bandla Ganesh to become the lead actor?

అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా జీవితా రాజ‌శేఖ‌ర్ గుట్టు విప్పారు. ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. బండ్ల గ‌ణేష్‌కు, త‌న‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘మా’ అభివృద్ధి కోసమే బండ్ల గణేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై వ్యతిరేకతతో ప్యానెల్ నుంచి తప్పుకున్నాడని తాను భావించడంలేదని వెల్లడించారు. ‘మా’ లో సభ్యత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని జీవిత తెలిపారు. ఎవరు గెలిచినా `మా` అభివృద్ధి కోసమే పనిచేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, ప్రస్తుతం వీకే నరేష్‌ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత కమిటీలో జీవిత రాజశేఖర్‌ జనరల్‌ సెక్రెటరీగా ఉన్నారు. మళ్లీ ఆమె అదే పోస్ట్ కి పోటీ చేయగా.. ఇప్పుడు బండ్ల కూడా ఈ పోస్ట్ కోసం బ‌రిలోకి దిగాడు.