బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ ప్రేమ‌లో ప‌డ్డ ప్రియాంక..ఓపెన్‌గానే చెప్పేసిందిగా!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ కాగా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి స‌భ్యులంద‌రూ మొదటి రోజు కాస్త సైలెంట్‌గా ఉన్నా.. రెండో రోజు నుంచే గొడవలు, ఏడుపులు మొదలు పెట్టేశారు. మ‌రోవైపు స్క్రీన్ స్పేస్ కోసం కంటెస్టెంట్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు చేసిందంటే..?

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, పెడబొబ్బలు, వివాదాలు ఎంత కామ‌నో ప్రేమాయ‌ణాలు అంతే కామ‌న్‌గా క‌నిపిస్తుంటాయి. అయితే ఈ సీజ‌న్‌లో ట్రాండ్స్ జెండర్ కోటాలో అడుగు పెట్టిన అందాల భామ ప్రియాంక రెండో రోజుల‌కే ఓ కంటెస్టెంట్ ప్రేమ‌లో ప‌డిపోయింది. ఆ విషయాన్నే ఆమెనే ఓపెన్‌గా చెప్పేసింది.

యాంకర్ రవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హౌస్ లో అందరు బాయ్స్ నాకు అన్నయ్యలే, నేను అలాగే పిలుస్తాను. కానీ, మానస్ ని మాత్రం నేను అన్నయ్య అని అస్స‌లు అన‌ని చెబుతూ సిగ్గుప‌డిపోయింది. దాంతో ఇంటి స‌భ్యులంద‌రూ ప్రియాంక‌ను ఆట‌ప‌ట్టిస్తూ నానా హంగామా చేశారు. మొత్తానికి మానస్ పట్ల తనకు క్రష్ ఉందని ప్రియాంక చెప్పకనే చెప్ప‌డంతో..నెట్టింట ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది.