చైతన్య లైఫ్ లోకి మరో అమ్మాయి వచ్చిందా.. ఇందులో నిజమెంత?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్య సమంతా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా సమంత టాలీవుడ్ కు బై చెప్తూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇటీవల సమంత ముంబైలో ఇల్లు కొనింది. ఇక బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసమే ముంబైలో సమంత ఇల్లు ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నాగ చైతన్య, సమంతా విషయానికి వస్తే వీరిద్దరూ త్వరలో విడిపోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలకు సమంత హాజరుకాకపోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. మరొకవైపు నాగచైతన్య జీవితంలోకి మరొక అమ్మాయి ఎంట్రీ ఇచ్చిందని అందుకోసమే సమంతా కు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు అనిపిస్తున్నాయి. అయితే చైతన్య లైఫ్ లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే చూడాల్సిందే.

Share post:

Latest