ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. హీరోయిన్ అనుకుంటే మీ పొరపాటే?

సాధారణంగా మనుషులు పోలిన మనుషులు ఏడుగురు అని అంటుంటారు. అలా ఒకే పోలికలతో ఇద్దరూ ఉండడం చూసి ఉంటాం. అయితే ఇదే విషయం సినిమాలో హీరో హీరోయిన్ల విషయంలో కూడా జరిగాయి. ఇప్పటికే హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా పలువురు హీరోల మాదిరిగానే అచ్చం పోలికలతో ఉండే మనుషులను ఇప్పటికే చూశాము. ఇక హీరోయిన్లలో కూడా కాజల్ సమంత పోలికలతో ఉన్న వారిని చూసాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో అచ్చం కత్రినా కైపు లా ఉండే ఒక అమ్మాయి ఫోటో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే తొందరగా కత్రినా కైఫ్ అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈమె అచ్చం కత్రినా కైఫ్ పోలికలతో ఉంది. ఇంకా చెప్పాలి అంటే వీరిద్దరిలో కత్రినాకైఫ్ ఎవరో చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అమ్మాయి పేరు అలీనా రాయ్. ఈమె రెండు లక్షల ఫాలోవర్ల తో సోషల్ స్టార్ గా మారిపోయింది. ఇందుకు గల ప్రధాన కారణం ఆమె అచ్చం బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ లా ఉండటమే.