ప‌వ‌న్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన హ‌రీష్ శంక‌ర్?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్‌డే కానుక‌గా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

Is this Pawan-Harish Shankar's title?

సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు `భవదీయుడు భగత్ సింగ్` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌ను హ‌రీష్ శంక‌ర్ ఫిక్స్ చేశార‌ట‌.

Pawan Kalyan-Harish Shankar's Film Might Go On Floors From This Month! - Filmibeat

టైటిల్ అదిరిపోవ‌డం, సినిమా క‌థ‌కి స‌రిగ్గా స‌రిపోవ‌డంతో.. మేక‌ర్స్‌తో పాటు ప‌వ‌న్‌కి కూడా బాగా న‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లోనే టైలిల్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని టాక్‌. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Share post:

Popular