సీటిమార్ సినిమా ఆ కొరత తీర్చింది అంటున్న గోపీచంద్?

దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన సినిమా సిటీమార్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా గోపీచంద్ కెరీర్ లోనే మొదటి రోజు కలెక్షన్స్ లో టాప్ సినిమా గా సిటీ మార్ నిలిచింది . ఈ నేపథ్యంలో గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ లో నేను ఎన్నో హిట్స్,ఫ్లాప్స్ చూసాను. నా నేను చేసిన సినిమా హిట్ అయిందా లేకుండా ప్లాప్ అయిందా అన్నది నాకు వచ్చే ఫోన్ కాల్స్ చెప్పేస్తాయి. ఈ మధ్యకాలంలో నా సినిమా హిట్ అని నేను వినలేదు కానీ సిటీ మార్ ఆ కొరతను తీర్చింది అంటూ గోపీచంద్ తెలిపారు.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన సిటీ మార్ ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పండుగ రోజు విడుదలైంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. శ్రీనివాస చిట్టూరి,పవన్ పడిన కష్టానికి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ గౌతమ్ నంద సినిమా అంచనాలను అందుకోలేకపోయింది, సీటీ మార్ సినిమా తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను అని తెలిపారు.

Share post:

Latest