ఫ్లిప్ కార్ట్ ప్రీ బుకింగ్ డీల్ బంపర్ ఆఫర్.. రూ.1 కడితే చాలు నచ్చింది ఇంటికే..!

ఆన్లైన్ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ సేవింగ్ డేస్ సేల్ , ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ డేస్ సేల్ లాంటివి ప్రవేశపెట్టి ఎన్నో రకాలుగా ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సేల్ లో చాలామంది కొనుగోలు చేసే సమయానికి, ఆ వస్తువులు అవుటాఫ్ స్టాక్ అని రావడంతో చాలామంది బాధపడుతుంటారు..ఇలాంటి వారికోసమే సరికొత్త నిర్ణయం తీసుకుంది ఫ్లిప్ కార్ట్. అది ఏమిటంటే ప్రీ బుకింగ్ అనే డీల్ ద్వారా ఒక రూపాయి కడితే చాలు నచ్చింది కొనుగోలు చేయొచ్చు అంటూ ఆఫర్ ప్రకటించింది.. అదేమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ లో ప్రవేశపెట్టిన ప్రీ బుకింగ్ సేల్ లో ఆఫర్ ప్రకటించక ముందే ఒక సేల్ ను నిర్వహిస్తారు. మీరు మీకు నచ్చిన వస్తువును ముందుగానే బుక్ చేసుకోవచ్చు అన్నమాట.. ఉదాహరణకు షోరూమ్ లలో ఎప్పుడో రాబోయే కొత్త బైకులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నట్టు.. ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి ముందే..ఒక రూపాయి కట్టి ముందుగా ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఇలా ముందుగానే ప్రీ బుకింగ్ చేసి పెట్టుకోవడం వల్ల సేల్ నిర్వహిస్తున్నప్పుడు , ఆ వస్తువు పై అధికంగా ఆఫర్ వుంటే చాలా మంది కొనుగోలు చేస్తారు..

సడన్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అనే విషయం రాకుండా మీరు ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి మీకోసం ఆ వస్తువు అలాగే ఉండిపోతుంది.. అవుట్ ఆఫ్ సోల్డ్ , అవుట్ ఆఫ్ స్టాక్ అని పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండాలంటే ఫ్లిప్కార్ట్ ప్రవేశపెడుతున్న ప్రీ బుకింగ్ ఎంచుకోవడమే ఉత్తమమైన పద్ధతి.