ఏవమ్ జగత్’ మూవీ నుండి రాధాస్ లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్!

September 15, 2021 at 8:58 pm

డైరెక్టర్ దినేష్ నర్రా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఏవమ్ జగత్’. ఈ సినిమాకు మణిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఇందులో కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనాయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులు జరగటంతో ప్రజలు వివిధ దేశాలలో స్థిరపడటం.. దీని వల్ల దేశం అభివృద్ధి చెందడం.. కలం గారి కల నెరవేరిందా అనే అంశాలతోనే కాకుండా వ్యవసాయం పట్ల అవగాహన నేపథ్యంలో కూడా రూపొందుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తాజాగా రాధాస్ లవ్ సాంగ్ ని విడుదల చేయగా.. ఈ పాటను టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగల్లా చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ పాటను సింగర్ శివ కుమార్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఈ పాటని వినిపించారు. ఇక అనన్య నాగల్లా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ సిని బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపింది. ఇక ఈ సినీ దర్శకుడు దినేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం ఏంటి? రాబోయే తరానికి కావాల్సిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగుభూమి కానీ, పండించగల అనుభవం కానీ దేశ యువత కి ఉందా అనే అంశాలు కూడా ఈ సినిమాలో చూపిస్తామని తెలిపాడు.

అంతే కాకుండా వ్యవసాయం, మానవ సంబంధాలతో ముడిపడి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం తెలిపే 20 ఏళ్ల యువకుడు కథ అని తెలిపాడు. ఈ కథ ఓ పల్లెటూరిలో సాగే జీవితంలా ఉంటుందని, దేశ పరిస్థితులను కొన్ని అంశాలనే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని సాధించడంలో 20 ఏళ్ల కుర్రాడు చేసే ప్రయత్నం అని తెలిపాడు దర్శకుడు దినేష్.

ఏవమ్ జగత్’ మూవీ నుండి రాధాస్ లవ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న మ్యూజిక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts