పుష్ప సినిమాలో పవన్ కళ్యాణ్.. అభిమానులకు ఇక పూనకాలే..!

September 15, 2021 at 9:24 pm

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పుష్ప.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డి గ్లామరస్ గా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించ బడుతోంది.

ఈ సినిమా లీకుల బెడద నుంచి తప్పించుకోవాలని ఎంత చూస్తున్న.. ఈ సినిమాకు సంబంధించి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫోటో లీక్ అవుతూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లుగా ఒక సమాచారం వెలువడింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా సంబరపడిపోతున్నారు. తాజాగా బన్నీ సెట్ లో ఉన్న లారీ ఫోటోలు లీక్ కాగా అందులో అద్దం మీద ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు.

ఇక అల్లు అర్జున్ నడిపే లారీ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ మధ్య అల్లు అర్జున్ వద్ద కొన్ని విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు రావడం జరిగింది. ఏది ఏమైనా పుష్ప సినిమాలు అల్లు అర్జున్ నడిపే లారీ పై ఇలా పవన్ ఫోటో కనిపించడం మెగా ఫ్యాన్స్ లో ఎంతో సంతోషాన్నిస్తోంది.

పుష్ప సినిమాలో పవన్ కళ్యాణ్.. అభిమానులకు ఇక పూనకాలే..!
0 votes, 0.00 avg. rating (0% score)