మహేష్‌ మొట్ట మొదట‌ వాడిన‌ ఫోన్‌ ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్ & ఎన‌ర్జిటిక్‌ హీరో మహేష్‌ బాబు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయ‌న‌. ఇక వివాదాల‌కు, వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఎప్పుడూ దూరంగా ఉండే మ‌హేష్‌.. ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

All Set For Mahesh Babu's Oath Taking Ceremony

తాజాగా మహేష్‌ బాబు తాజాగా బిగ్‌సీ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేష్.. వృత్తిప‌ర‌మైన విష‌యాల‌ను, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఒక‌రు మీరు ఉపయోగించిన తొలి మొబైల్‌ ఫోన్‌ ఏంటి.? అని ప్ర‌శ్నింగా.. అందుకు మహేష్ `నోకియా క్లాసికల్‌ మోడల్‌` అని చెప్పుకొచ్చారు.

Mahesh Babu to undergo knee surgery

మ‌రో విలేక‌ర్ `చలా మంది మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు కదా.. మరి మీరు ఎవరితో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారు.?` అని అడ‌గ్గా.. మ‌హేష్ `మా నాన్న‌` అంటూ క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా చెప్పేశారు. ఇక మీ ఎన‌ర్జీకి సీక్రెట్ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్నైనా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్ అంటూ మ‌హేష్ చెప్పుకొచ్చాడు.