బిగ్‌బాస్‌లోకి చ‌ర‌ణ్‌, నితిన్‌ల రాక ఫ్లాప్ అయిందా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారం పూర్తి కాబోతోంది. ఈ వారంలో అనీ మాస్టర్‌, లోబో, ప్రియాంక సింగ్‌ సేవ్ అవ్వ‌గా.. ఇంకా నామినేషన్‌ లో ప్రియా, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ అయిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్.. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చి నాగ్‌తో సంద‌డి చేశారు.

BiggBossTelugu5 Megapowerstar Ram Charan on the BIGG Boss stage :  బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌజ్‌మేట్స్‌ను సెట్ చేస్తానన్న నాగ్‌ | వినోదం  News in Telugu

అపై ఇంటి సభ్యులతో చ‌ర‌ణ్ సరదాగా ముచ్చటించారు. ఈ క్ర‌మంలోనే ఇంటి సభ్యులంద‌రినీ చరణ్‌కి ప‌రిచ‌యం చేస్తూ.. వారిపై పంచ్‌లు వేశాడు నాగ్‌. అలాగే మ‌రోవైపు హాట్‌స్టార్‌లో మాస్ట్రో చిత్రం స్ట్రీమ్ అయిన సంద‌ర్భంగా నితిన్‌, న‌భా న‌టేష్‌, త‌మ‌న్నాలు కూడా బిగ్‌బాస్ షోకి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

Bigg boss : Ram Charan's magic in the house

అయితే ఎంతో సంద‌డిగా సాగిపోయిన ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌కి భారీ టీఆర్పీ వ‌స్తుంద‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, బిగ్‌బాస్‌లోకి చ‌ర‌ణ్‌, నితిన్‌ల రాక ఫ్లాప్ అయింద‌ని గుస‌గ‌స‌లు వినిపిస్తున్నాయి. ఊహించిన టీఆర్పీని ఈ ఎపిసోడ్ అందుకోలేక‌పోయింద‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Share post:

Popular