దుల్కర్ సల్మాన్ తో జతకట్టనున్న బ్యూటీ..!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోగా పేరుపొందాడు. ఇక మహానటి సినిమాలో ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో కూడా దుల్కర్ డైరెక్టుగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకి డైరెక్టర్ హను రాఘవపూడి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా.. అయితే ఈ సినిమాలు మరొకసారి హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఈమె చిన్న పాత్రే అయినప్పటికీ ఆ పాత్ర సినిమాకి చాలా కీలకంగా ఉండడంతో ఈ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని స్వప్న సినిమాస్ అనే బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ బ్యానర్ పై జాతి రత్నాలు సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది.

ఇక డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు తీసినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు ఆ డైరెక్టర్. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించనున్నారు.