ఫేస్ బుక్ లో పెరిగిపోతున్న బూచాళ్లు.. అలాంటి వీడియోలు పంపిస్తూ?

సర్.. నా ఫేస్ బుక్ ఖాతా కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల వీడియోలు పంపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొందరు నేరగాళ్లు నకిలీ ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారందరికీ డబ్బుల కోసం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతా ఉన్నట్లే.. తాజాగా ఖాతాలను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లోని వారికి అశ్లీల వీడియోలను పంపు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందుకోసం సెక్యూరిటీ సెట్టింగ్స్ సరిగా లేని ఖాతాలను ఎంచుకుంటున్నారు. వృత్తి నిపుణులు అలాగే యువతులు, మహిళలు విద్యార్థులు ఎక్కువగా వీటి బారిన పడి మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి.

రోజు రోజుకి ఇలాంటి కేసులు ఎక్కువ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని ఫేస్ బుక్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటిని పోలీసులు నేరపూరితమైన పోస్టులుగా ధృవీకరిస్తే తాము స్పందిస్తామని వారు తెలిపారు. ఇందుకోసం పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి, అందులో ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేసిన వెంటనే ఫేస్ బుక్ ప్రతినిధుల నుండి ఖాతాను తొలగిస్తారు. అశ్లీల వీడియోలు చిత్రాలు కనపడకుండా చర్యలు తీసుకుంటారు. ఒకే వ్యక్తి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతుంటే వెంటనే వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది. కొందరు నేరగాళ్లు మహిళలలో విద్యార్థులను ఆకర్షించేందుకు నకిలీ ఫోటోలతో ఖాతాలు తెరిచి ఆ తర్వాత పరిచయం పెంచుకుని, వారు కోరిన కోరికలు తీర్చకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఇలా ఎవరైనా మీకు మెసేజ్ చేసిన అలాంటి వారి మీద సైబర్క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి.

Share post:

Latest