సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?

టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశానికి సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. సినీమా ఇండ‌స్ర్టీస్‌లోని ప‌లు సమస్యలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ విష‌య‌మై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆల‌స్య‌మ‌వుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. స‌మావేశం వాయిదా వేశార‌ని పుకార్లు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుత అందిన స‌మాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి.

శ‌నివారం యథావిధిగా సీఎం జ‌గ‌న్‌తో భేటీ జర‌గ‌నున్న‌ట్టు పుకార్లు. సెప్టెంబర్04న జ‌రిగే స‌మావేశంలో కేవలం ఏడుగురు ఫిల్మ్ ప్రముఖుల‌కు మాత్రమే పాల్గొంటార‌ని వినికిడి. పాల్గొనే వారిలో చిరంజీవితో పాటు ఇండ‌స్ర్టీ పెద్ద నిర్మాత మ‌రియు ఎగ్జిబిటర్ డి.సురేష్ బాబు ఉండ‌నున్నారు. అగ్ర‌ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి – మండలి ప్రెసిడెంట్ కళ్యాణ్- నిర్మాత కం పంప‌క‌దారుడు ఎగ్జిబిటర్ దిల్ రాజు ఈ గ్రూప్లో ఉండ‌నున్న‌ట్టు తెలిసింది. వీరితో పాటు ఇంకా ఇద్ద‌రు ఎవ‌రు అని తెలియ‌డం లేదు. ఇకపోతే జగన్ మోహ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి వ్య‌క్తి అయిన అక్కినేని నాగార్జున ఈ భేటికి వెళ్లడం లేదని స‌మాచారం. నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ నూత‌న సీజన్ ఓపెనింగ్ కోసం ప్రిపరేషన్స్లో ఉన్నారు. ప్రారంభ ఎపిసోడ్ ఉండ‌డం వల్ల ఆయనకు తీరిక లేక కుదరడం లేదని తెలిసింది. స‌మావేశంలో ముఖ్యంగా టిక్కెట్టు ధ‌ర‌లు, ఈ స‌మ‌స్య‌తోనే పెద్ద సినిమాలు విడుద‌ల‌ కావడం లేద‌ని టాక్‌. ఇటీవల టికెట్ రేట్ల‌పై ఆంధ్రాలో వచ్చిన సవరణ జీవోతో కొన్ని చిక్కులున్నాయి. దీనిపై చ‌ర్చించేందుకు సీఎం జ‌గ‌న్ భేటీకానున్నారని తెలిసింది. గ్రామ పంచాయితీ- నగర పంచాయితీ- మున్సిపాలిటి ఏరియాల్లో టిక్కెట్టు ధరలపై పై కూడా చర్చిస్తారు. దర్శకుడు, నిర్మాత నారాయణ మూర్తి చిన్న నిర్మాతల సూచ‌న మేరకు ప్ర‌తి ఐదో షోని చిన్న ఫిలింకు కేటాయించాల‌ని సీఎం జ‌గ‌న్ కోరనున్నారు.