సీటీ మార్ లో నటించిన బిగ్ బాస్ బ్యూటీ ఎవరో తెలుసా..?

గోపీచంద్ స్పోర్ట్స్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం సీటీ మార్.. ఈ చిత్రం ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమా ఏకంగా రూ.3.3 కోట్ల కలెక్షన్లు రాబట్టి మంచి రికార్డును నెలకొంటోంది.. ఇక ఎట్టకేలకు ఈ సినిమాతో గోపీచంద్ కల నెరవేరిందని చెప్పాలి.. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న తో పాటు దిగంగన సూర్యవంశీ కూడా మరో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈమె ఎవరు అనే విషయానికి వస్తే.. హిందీలో 2015లో బిగ్ బాస్ సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసిందట.

మొదటిసారిగా తన ఏడు సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక హిందీ సిరీస్ ద్వారా తన జీవితాన్ని మొదలు పెట్టింది.ఇక ఆ తర్వాత 2018వ సంవత్సరంలో ఫ్రైడే అనే సినిమా ద్వారా హిందీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. 2019 సంవత్సరంలో హిప్పీ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ , పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ తరవాత 2019లో తమిళ చిత్రం ధనసు రాశి నెయ్యర్ గాలే అనే చిత్రంతో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు సీటిమార్ సినిమాతో ఈమె పేరు బాగా వినిపిస్తోందని చెప్పాలి.