సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!

September 14, 2021 at 7:51 am

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఈయన మరణాంతరం సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.

ఈయన 1990లలో మలయాళ సినీ ఇండస్ట్రీలో విలన్ గా పలు సినిమాలలో నటించారు. పశుపతి అనే సినిమా ద్వారా 1990ల తొలిసారిగా ఈయన విలన్ క్యారెక్టర్ లో నటించాడు. ఇక అదే సంవత్సరం వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ..”ఇన్ హరిహర్ నగర్”లో జాన్ హునైర్ పాత్ర ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలలో విలన్ గా నటించాడు.

దాదాపు 150 చిత్రాల్లో నటించిన తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక చివరిగా ఈయన మమ్ముట్టి నటించిన వన్ సినిమా లో నటించారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ ప్రముఖులు చనిపోతున్నారు.

సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts