హైద‌రాబాద్‌లో అరాచ‌కం..బాత్‌రూమ్‌లో కెమెరాలు పెట్టిన కేటుగాళ్లు..!?

హైదరాబాద్‌లో కొంద‌రు కేటుగాళ్లు అరాచ‌కంగా ప్ర‌వ‌ర్తించారు. నగ్న దృశ్యాలను చిత్రీకరించేందుకు లేడీస్ బాత్‌రూమ్‌లో రహస్యంగా కెమెరాలు పెట్టేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వన్ డ్రైవ్‌ ఇన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు లేడీస్‌ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు.

- Advertisement -

అయితే ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతి నిన్న రాత్రి అక్కడికి వెళ్లింది. ఆమె వాష్‌రూమ్‌లో కెమెరాను గుర్తించింది. దాంతో కంగారు ప‌డిన ఆమె పోలీసుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు..సీలింగ్‌ లైట్‌లో అమ‌ర్చిన మొబైల్‌ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

అప్పటికే అందులో ఐదు గంటలుగా రికార్డింగ్ అవుతోంద‌ని గుర్తించిన పోలీసులు.. కేసు న‌మోదు చేసి వన్‌ డ్రైవన్‌ ఇన్‌ యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం కెమెరాను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Share post:

Popular