సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా ప్రకంపనలు సృష్టిస్తోంది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అవకాశాలు రావాలంటే పక్కలోకి రావాల్సిందే.. లేదంటే చిత్ర పరిశ్రమలో రాణించడం కష్టం అన్నట్లుగా మారిపోయింది. ఇక ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ లపై ఒక స్టార్ హీరోయిన్ మల్లికా షేరావత్ కొన్ని విషయాలను బయటపెట్టింది..
బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన అందచందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది ముద్దుగుమ్మ మల్లికాశెరావత్ ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ.. కొన్ని విషయాలను తెలియజేసింది. నేను నేరుగా ఎప్పుడు నా కెరీర్లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదు.. కానీ ఎంతోమంది నటులు నాకు చాలా దగ్గర అవ్వాలని ప్రయత్నించాడంటే తెలియజేసింది.
తెర మీద ఎంత బోల్డ్‌గా కనిపిస్తే తమతో కూడా అంతే బోల్డ్ గా ఉండాలంటే తనతో చెప్పారని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక ఇదే తంతు లో ఆమె కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక.. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదని.. ఎన్నో అవకాశాలు వదులుకున్న ట్లుగా ఆమె తెలియచేసింది. మల్లికా షేరావత్ చేసిన ఈ కామెంట్ చాలా హాట్ టాపిక్ గా మారాయి. అందుచేతనే ఈమె భారతదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళింది.అంతే కాకుండా టాలీవుడ్ లో కూడా శ్రీ రెడ్డి ఈ విషయంపై ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేసింది.