మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు.

ఇందులో కాజల్ నాగార్జునకు సార్ నాకు మటన్ బిర్యానీ తినాలని ఉంది అని చెప్పగా..వంట చేసుకుని తిను అని నాగ్ చెప్పారు. ఆ తరువాత ప్రియాంకతో డ్యాన్స్ చేసే అవకాశం మనకు దొరికింది. ఇక ఇంట్లో గుంటనక్క ఎవరు అని సిరిని ప్రశ్నించగా..సిరి రవిని చూపించింది. ఇంట్లో అందరితో డాన్స్ చేయించిన నాగార్జున యాంకర్ రవి పెళ్లి అయిన విషయాన్ని కూడా మర్చిపోయారు అంటూ కామెంట్ చేశారు.ఇందులో లహరి.. ఉమాదేవిని ఎంచుకోగా.. శ్రీరామచంద్ర.. మానస్‏ను ఎంచుకున్నాడు. మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడని అనిపిస్తుందని.. శ్రీరామ చంద్ర చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత షణ్ముఖ్.. తనను తాను పనీష్ చేసుకున్నట్లుగా ప్రోమోలో చూపించారు.

Share post:

Latest