భిక్షాటన చేస్తున్న మాజీ సీఎం మరదలు.. ఆమె మాటలు వింటే..?

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి మరదలు.ఈమె ఎడ్యుకేషన్ పరంగా పీహెచ్డీ చేసింది.ఇక ఈమె ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పింది కానీ ప్రస్తుతం వీధుల వెంట తిరుగుతూ అడుక్కునే వారు పెట్టే అన్నం తింటున్నది. ఇక ఆ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

పశ్చిమ బెంగాల్ కు 10 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు ఈమె.ఈ విషయం తెలిసిన వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.ఈమె స్పష్టంగా ఇంగ్లీష్, బెంగాలీ మాటలను చూసి అక్కడున్న ప్రజలు అంతా ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈమె టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా.ఈమె 1976 సంవత్సరంలో ఒక పాఠశాలలో టీచర్ గా చేసింది.ఇక ఆ తర్వాత 2009 జూన్ 28న ఆమె రిటైర్ అయ్యింది.

ఇక ఆ స్కూల్ కు సంబంధించి హెడ్మాస్టర్ ఇలా మాట్లాడుతూ.. ఇరబసు తమ స్కూల్లో పాఠాలు బోధించేవారు రిటైర్డ్ అయిన తర్వాత ఆమెకు రావాల్సిన పెన్షన్ సంబంధించి దరఖాస్తు ఫారం ఇచ్చిన.. ఆమె వాటిని సమర్పించలేదు అన్నట్లుగా తెలియజేశాడు. సెప్టెంబర్ 5వ తేదీన ఈమెనూ ఆ ఆర్గనైజేషన్ సభ్యులు పూలమాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు.టీచర్లు అందరూ తనను ఇంకా ఇష్టపడుతున్నారని చాలా మంది విద్యార్థులకు కూడ గుర్తున్నానని ఇర బసు ఈ సందర్భంగా పేర్కొన్నది.

Share post:

Latest