రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన బాలాపూర్ ల‌డ్డూ..ఎంత పలికిందంటే?

తెలంగాణ‌లో బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని న‌మ్ముతారు. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో పాల్గొని.. ల‌డ్డూను ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు.

 గత ఏడాది కరోనా కారణంగా లడ్డూని తెలంగాణ సీఎం కేసీఆర్ బహూకరించిన ఉత్సవ సమితి.. ఈ ఏడాది ఘనంగా నవరాత్రులు జరిపి వేలంపాట నిర్వహించింది.

ఇక ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా బాలీపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌కు అమ్ముడైంది. ఈ రోజు ఉద‌యమే బాలాపూర్ గణేశుడు ఊరేగింపుగా బయలుదేరాడు. గ్రామ వీధుల గుండా శోభాయాత్ర కొనసాగించిన అనంతరం బాలాపూర్‌లోని బొడ్రాయి వద్ద లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలం పాట‌లో ఆ ల‌డ్డూ రూ.18.90 ల‌క్ష‌లకు ప‌లికింది.

Balapur Ganesh Laddu Fetch Rs 19 lakh this year | INDToday

కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ అనే మరో వ్యక్తితో కలిసి లడ్డూని వేలంలో గెలుచుకున్నారు. కాగా, కాగా బాలాపూర్ లడ్డు వేలం 1994 నుండి కొనసాగుతుండగా మొదటి సంవత్సరం కేవలం 450 రూపాయలు మాత్రమే. అయితే ఇప్పుడు ఈ 25 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయల వరకు ప‌ల‌క‌డం విశేషం.

 

Share post:

Popular