కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి..చివరకు..!

September 19, 2021 at 12:12 pm

ఇటీవలకాలంలో అఘాయిత్యాలు రోజురోజుకి తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఇటీవల ఒక కసాయి తండ్రి కూడా తన కన్న బిడ్డల్ని కడతేర్చిన పరిస్థితి ఏర్పడింది.. ఇంతకంటే దారుణం మరెక్కడా ఇంకొకటి ఉండదేమో..

పూర్తి వివరాల్లోకి వెళితే, బర్మెర్ లోని కోషాల గ్రామానికి చెందిన పుఖారాం అనే 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తన భార్యా ,నలుగురు పిల్లలతో ఆనందంగా కలిసి జీవిస్తూ ఉండేవాడు.. ఐదు నెలల క్రితం కరోనా మహమ్మారి బారిన పడి, అతని భార్య మరణించడంతో తన నలుగురు ఆడపిల్లలు బాగోగులను చూడడం ఆయనకు కష్టంగా అనిపించింది.. ఇక ఈ నేపథ్యంలోనే తన మరదలను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు.. ఇక పక్కింటి వాళ్ళు ఒప్పుకోలేదు.. కనీసం పిల్లల బాగోగులు అయిన చూసుకోమని కోరినా వాళ్లు పట్టించుకోలేదు.

తీవ్ర మనస్థాపానికి చెందిన ఆయన వెంటనే తన నలుగురు బిడ్డలను జియో (9),హైనా (3), నోజీ ( 7), లాసీ ( 18 నెలలు) 13 అడుగుల లోతు ఉన్న నీళ్ల ట్యాంకులు పడవేసి, ఆయన కూడా అదే ట్యాంకులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబాయడు . ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేలోగా అతడిని నీళ్ళ ట్యాంకు నుంచి వెలికి తీశారు.. అపస్మారక స్థితి లో ఉన్న ఇతనిని ఆస్పత్రికి తరలించారు.. కానీ అప్పటికే తన బిడ్డలు నలుగురు మరణించారు.. ఇక ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి..చివరకు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts