సిద్ధార్థ్ లేనందుకు బాధగా ఉంది.. నటి ఆవేదన?

బిగ్ బాస్ 13 విజేత, దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సిద్ధార్థ శుక్లా తో చివరి రోజుల్లో కలిసి లేనందుకు నటి ఆర్తి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధార్థ తాను కొంత కాలంగా మాట్లాడుకో లేదని చివరగా 2019 ఫిబ్రవరి లో మాట్లాడినట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఆర్ టి సి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ చివరి క్షణాల్లో మాట్లాడనందుకు చాలా బాధగా ఉంది అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సిద్ధార్థ్ అతడి రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ షెకనాజ్ గిల్ మధ్యలో వెళ్తున్నానని నాపై ఆరోపణలు చేశారు, అంతేకాకుండా మా స్నేహాన్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ల రిలేషన్ షిప్ ను నేను డిస్టర్బ్ చేస్తున్నాను అని వారి మధ్య దూరాన్ని పెంచుతున్నాను అంటూ నన్ను నిందించారు అంటూ ఆమె చాలా బాధపడింది. అందువల్ల సిద్ధార్థ తో మాట్లాడడం కూడా మానేశాను, రెండేళ్లుగా సిద్ధార్థ్ తో కాంటాక్ట్ లో కూడా లేనని తెలిపింది. ఇలా అకస్మాత్తుగా అందరినీ విడిచి వెళ్ళి పోతాడు అని ఊహించలేదు అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది.

Share post:

Popular