హైదరాబాదులో మహేష్ కోసం మాసి హౌస్.. ఖర్చు ఎంతంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దర్శకుడు త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్.నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ను త్రివిక్రమ్ అప్పుడే పూర్తి చేశారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేశ్, త్రివిక్రమ్ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ రూ. 5 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ లో ఓ మాసీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని తెలుస్తోంది. ఇక ఇందులో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారు త్రివిక్రమ్.మహేశ్, త్రివిక్రమ్ మూవీకి హీరోయిన్ గా పూజా చాలా అసెట్ అని అర్ధమవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మహేశ్ బాబును ఏరేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి మరి.

Share post:

Latest