ఆమె గురించి ప్రస్తావన రావడంతో కన్నీరు పెట్టుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి..!

పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు సౌందర్య.. అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ప్రేక్షకులలో ఏర్పాటు చేసుకుంది. అంతా బాగుంది ఈమె సినీ కెరియర్ పీక్స్ లో ఉంది అని అనుకుంటున్న సమయంలోనే బిజెపి పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తూ ఉండగా..హెలికాప్టర్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల ఎస్ వి కృష్ణారెడ్డి తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం కు హాజరయ్యారు. 175 వ ఎపిసోడ్ ప్రోమో చాలా ఘనంగా జరిగింది.

Soundarya songs: 'సౌందర్య పాట వస్తే.. టీవీ ఆపేసేవాడిని'

ఈ సందర్భంగా ప్రోమో మొత్తం హడావిడిగా సాగింది. ఈ ప్రోమో లో సౌందర్య గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మిగతా ముగ్గురు కూడా తీవ్రంగా బాధ పడ్డారు.. ఇక సౌందర్య లాంటి గొప్ప నటి ఇక ఎప్పుడు మనకి తిరిగి రాదు. ఆమె చనిపోయిన తర్వాత టీవీలో ఆమె పాట వస్తే నేను టీవీ ఆఫ్ చేసేవాణ్ని. అంతలా ఆమె మృతి నన్ను చాలా కలిచి వేసింది అని చెప్పుకొచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి.

Watch Number One Movie Online for Free Anytime | Number One 1980 - MX Player

ఇక ఇప్పటికీ అలాంటి పాత్రలు ఎవరికైనా రాద్దాం అనుకున్నా, అందుకు తగిన కథానాయకులు లేరని చెప్పేశారు కృష్ణారెడ్డి. దీంతో ఆ షోలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా బాధకు గురయ్యారు. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మించిన రాజేంద్రుడు-గజేంద్రుడు, నెంబర్ వన్, టాప్ హీరో వంటి సినిమాలలో సౌందర్య కథానాయకిగా నటించింది. ఇవన్నీ హీరో సినిమాలే అయినప్పటికీ.. ఇందులో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం గా ఉన్నాయ్ అని తెలియజేశాడు.
.