పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సమరం ముగిసేనా?

పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కి ఆ రోజు పండగ అని చెప్పవచ్చు. నేడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు నేను ఒక పండుగ జరుపుకుంటున్నారు. అంతేకాకుండా పుట్టినరోజుకి తాను చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోతుంది.నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కి విష్ చేస్తున్నారు.

నేడు పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కు గుర్తుండిపోయే విధంగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరం కూడా మీకు మరింత శాంతి సంతోషాన్ని కలిగించాలి అని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది మెగా అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది. దీనితో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కౌగిలించుకున్నట్లుగా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

Share post:

Latest