అఖండ రిజల్ట్ పై కోసం వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. కారణం?

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా తో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై గురించి వస్తున్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే బోయపాటి ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంటుందని నమ్మకం ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మరొక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి కథను వినిపించాడు. కానీ అల్లు అర్జున్ అఖండ సినిమా ఫలితాన్ని బట్టి బోయపాటి శ్రీను నీకు ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.బోయపాటి శ్రీను మరోవైపు రామ్ పోతినేని తో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.

అయితే అఖండ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బిజీ బిజీగా ఉండటంవల్ల, బోయపాటి కి వెయిట్ చేసే ఓపిక లేక ఆ కథను రామ్ కు వినిపించాడంట తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి రెండవ చిత్రం అయినా రాపో 19 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రామ్ ఏ ఆర్ మురుగదాస్ కాల్ చేయాలని చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఏ ఆర్ తో కలిసి ప్రాజెక్ట్ ఓకే కాకపోతే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. బోయపాటి ప్రస్తుతం తన దృష్టి అంతా అఖండ సినిమాపై పెట్టారు. అంతే కాకుండా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ ఎదగాలని జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాట పెండింగ్లో ఉంది అది కూడా సెప్టెంబర్లో పూర్తవుతుంది. ఒకవేళ అన్ని అనుకున్న విధంగా జరిగితే అఖండ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.