భార్య బ‌ర్త్‌డే..అలా విషెస్ తెలిపిన అల్లు అర్జున్‌!

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి, అల్లు వారి కోడ‌లు స్నేహా రెడ్డి బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 29) నేడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు మ‌రియు అల్లు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. త‌న ప్రియ‌మైన భార్య‌కు బ‌న్నీ కూడా స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

 అల్లు స్నేహరెడ్డి బ్యూటీఫుల్ పిక్స్ Photo : Instagram

`నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ` అంటూ ఆమెతో దిగిన ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తుంది. దాంతో ఆయ‌న ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

 అల్లు స్నేహరెడ్డి బ్యూటీఫుల్ పిక్స్ Photo : Instagram

కాగా, అల్లు అర్జున్ ,స్నేహారెడ్డి లది ప్రేమ వివాహం. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఈ క్యూట్ క‌పుల్‌కు 2014లో ​కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. స్నేహ విష‌యానికి వ‌స్తే.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం, తక్కువ కాని క్రేజ్ ఆమె సొంతం.సోష‌ల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే స్నేహ‌.. బన్నీ, తమ పిల్లల గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. దాంతో రోజురోజుకు ఆమె ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

https://twitter.com/alluarjun/status/1310842295005007875?s=20